Bigg Boss: ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవ్వబోతుందా..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా ప్రతివారం ఆడవాళ్లే ఎలిమినేట్ అవుతున్నారు. అయితే మధ్యలో ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్లు చూపించిన సీక్రెట్ రూమ్ లో ఉంచి మళ్లీ హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్. తర్వాత కూడా వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ వారంలో ఫోటోలు తగలబెట్టి నామినేషన్ చేయడం జరిగింది. గౌతమ్, శోభ, అశ్విని, శివాజీ, ప్రియాంక, అమరదీప్, సందీప్, బోలె నామినేషన్‌లో ఉన్నారు.

ఇక మొదటిసారిగా సందీప్ నామినేషన్‌లోకి రావడంతో సందీప్ డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా నెట్టిజ‌న్స్ భావిస్తున్నారు. అయితే మొదటినుంచి ఆడవారే ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న అందరిలో శోభకు తక్కువగా ఓటింగ్స్ వచ్చాయి. ఒకవేళ ఈసారి కూడా ఆడవారినే ఎలిమినేష‌న్‌ ఇవ్వాలనుకుంటే కచ్చితంగా శోభనే ఎలిమినేట్ అవుతుంది అంటూ వినిపిస్తుంది. ఆమె తప్పితే సందీప్‌కి ఎల్మినేట్ ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటూ బిగ్ బాస్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక అదే విధంగా రికార్డ్‌ ఓటింగ్ నిర్వహించగా కింది స్థానంలో శోభ ఉండగా తరువాత స్థానంలో సందీప్ ఉన్నాడు.

దీంతో శోభనే కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రియాంక మరియు గౌతమ్‌లకు కూడా చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో అశ్విని కూడా ఉంటుంది అనే న్యూస్ వినిపించినా శోభ‌కి 99% వరకు ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. కొన్ని గంటల్లో ఓటింగ్ లైను ముగుస్తాయి కనుక కచ్చితంగా శోభ డేంజర్ జోన్ లో ఉన్నట్లే. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈవారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవుతుందా.. ఇంకెందుకు అమ్మాయిలను హౌస్ లోకి పంపించడం.. మొత్తం జెంట్స్ నే పంపించి బాయ్స్ హాస్టల్ రన్ చేసుకోవచ్చుగా.. అంటూ నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.