అనారోగ్యంతో బాధపడుతున్న సంపూర్ణేష్ బాబు.. క్లారిటీ ఇదేనా..?

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భిన్నవిభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న సంపూర్ణేష్ బాబు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు అంతకుమించి అభిమానులను సొంతం చేసుకున్నారు కూడా .. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా కలవరపడ్డారు.. దీంతో తాజాగా ఆయన సోషల్ మీడియాలో తనపై వస్తున్న వదంతులకు క్లారిటీ ఇచ్చారు.

సంపూర్ణేష్ బాబు తాజాగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 27వ తేదీన రాబోతున్న విషయం తెలిసిందే . ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఆయనకు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి మీరు ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం మిమల్ని ఇండస్ట్రీలో ఎవరో తొక్కేసే ప్రయత్నం చేశారంట కదా.. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని ప్రశ్నించారు.. ఈ ప్రశ్నలకు సంపూర్ణేష్ బాబు స్పందిస్తూ.. నన్ను ఎవరో తొక్కేసే ప్రయత్నం చేయలేదు.. అలాగే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ వచ్చిన వార్తలలో ఎటువంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం తాను మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తున్నానని.. త్వరలోనే అవి కూడా నెలల వ్యవధిలో రిలీజ్ చేస్తానని కూడా సంపూర్ణేష్ బాబు స్పష్టం చేశారు. హృదయ కాలేయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.