న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ సాధించిన నాని.. హాయ్ నాన్న సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి నాని కూడా సిద్ధమవుతున్నాడు.
తాజాగా నాని సేనాపతి అనే ఓటిటి ఫిలిం ద్వారా సక్సెస్ అందుకున్న డైరెక్టర్ పవన్ సాదినేని కి ఛాన్స్ ఇచ్చాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. నిజానికి పవన్ ఇంతకుముందు నారా రోహిత్ లాంటి హీరోలతో కొన్ని సినిమాలు చేసిన అవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక తాజాగా ఈయన ఓటీటీ ఫిల్మ్ సేనాపతి సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన పవన్ న్యాచురల్ స్టార్ నానిని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకున్నాడట. ఈ సినిమా స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ అని సమాచారం.
ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో నాని కూడా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ కూడా వైవిద్యమైన కధ. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చకున్నాయి. నాని లాంటి ఓ హీరో పవన్ లాంటి చిన్న డైరెక్టర్ కు ఓకే చేయడం గ్రేట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని ప్రస్తుతం స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు.