లియో కలెక్షన్స్ లెక్కలన్నీ ఫేక్.. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..?

ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. అంతేకాదు వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.460 కోట్ల గ్రాస్ వసూలు చేసి వారం రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించిందని అందరూ ప్రకటించారు. అంతేకాదు లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచారు. కానీ ఈ సినిమా తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మిగిలిన ప్రాంతాలలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా సరే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిందని ప్రమోషన్స్ కూడా చేసుకున్నారు.

కానీ తాజాగా తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపూరు సుబ్రహ్మణ్యం లియో సినిమా కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారితీస్తోంది. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లియో కలెక్షన్స్ అన్ని ఫేక్.. నిర్మాతలు తప్పుడు కలెక్షన్స్ చెబుతున్నారు.. తమిళనాడు థియేటర్స్ కి ఈ సినిమా వల్ల ఎటువంటి లాభం రాలేదు. నిర్మాత లలిత్ కుమార్ రూ .5కోట్లు ఖర్చుపెట్టి ఫేక్ బుకింగ్స్, ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. తప్పుడు కలెక్షన్స్, ప్రమోషన్స్ చేయిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పలువురు విజయ్ అభిమానులు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. మరి రియల్ కలెక్షన్స్ ఎంత రాబట్టింది అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.