పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచేత్తిన శ్రీ లీల.. దేవుడు లాంటివాడు అంటూ..

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది యంగ్ బ్యూటీ శ్రీ లీలా. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డం సంపాదించుకున్న బ్యూటీ వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇటీవల ఆమె చేసిన స్కంధ‌ సినిమా ప్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయిన భగవంత్ కేసరి మూవీ పెద్ద హిట్ కావడంతో.. ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఇకపోతే వచ్చే నెలలో ఈమె హీరోయిన్గా నటించిన మరో మూవీ ఆదికేశవ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి పాట ఇటీవల రిలీజ్ అయింది. ఈ పాటలో శ్రీ లీల మరోసారి తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీ లీల ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. అయితే ఈవెంట్‌లో యాంకర్ ప్రస్తుతం పనిచేస్తున్న హీరోలందరి గురించి ఒక మాట చెప్పాలని అడగగా.. శ్రీ లీల పవన్ కళ్యాణ్ వంతు వచ్చినప్పుడు ఆయన దైవంతో సమానం అంటూ కామెంట్ చేసింది.. ఆయన చుట్టూ ఉండే ఆరా చాలా స్పెషల్ అని ఆయన చూస్తే దేవుణ్ణి చూసినా అనుభూతి కలుగుతుందని వివరించింది.

ప్రస్తుతం అందరు హీరోలతో కలిసి పనిచేస్తున్న శ్రీ లీల ఏ హీరో గురించి కూడా ఇంత గొప్పగా మాట్లాడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ దేవుడు అంటూ పోల్చిందంటే ఆమెకి పవన్ కళ్యాణ్ ఎంతలా కనెక్ట్ అయ్యాడో చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటివరకు మూడు స్కెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంటే.. శ్రీ లీల ఆ మూడు స్కెడ్యూస్‌లోను పాల్గొంది. ఇక శ్రీలీల.. మహేష్ బాబుతో కూడా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక‌ తాజాగా శ్రీ లీల పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.