వెంక‌టేష్‌కు హిట్ ఇచ్చిన ఆ లేడీ సూర్య‌కు హిట్ ఇస్తుందా…!

సినీ ఇండస్ట్రీలో ప్రజెంట్ మల్టీస్టారర్ హవా బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మల్టీ స్టార‌ర్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. దీంతో డైరెక్టర్‌లు కూడా మల్టీ స్టార‌ర్ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ మరో హీరో చేయవలసిన అవసరం లేకపోయినా సరే గెస్ట్ అపీరియన్స్‌తో వేరే హీరోను తాము తెరకెక్కించే సినిమాల్లో చూపిస్తున్నారు. అదేవిధంగా విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ అనే పాత్రలో చివరి 10 నిమిషాల్లో కనిపించి సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు.

అయితే విక్రమ్ సినిమా సక్సెస్ లో సూర్య పోషించిన చివరి 10 నిమిషాలు హైలెట్ అయింది. కేవలం సూర్య రోలెక్స్ రోల్ చూడడం కోసమే సినిమాకు పదేపదే వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఏదైనా మూవీలో ఒక రోల్ స్ట్రాంగ్ గా ఉందంటే సినిమా ఎంత బాగా సక్సెస్ అవుతుంది అని చూపించడానికి రోలెక్స్ పాత్ర ఉదాహరణ. ఇక ఈ నేపథ్యంలోనే తమిళ్ సూపర్ స్టార్ సూర్య మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కలిసి హీరోలుగా ఓ మల్టీ స్టార‌ర్ లో నటించబోతున్నారంటూ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ కాంబో నిజమేనంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర‌.

గతంలో సుధా కొంగర – సూర్య కాంబినేషన్లో వచ్చిన సురారై పొట్రు ( ఆకాశమే నీ హద్దురా ) సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్లో మరోసారి ఈ సినిమా రాబోతుందట. ఇక ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని టాక్. ఈ సినిమా తమిళనాడులోని ఓ వాస్తవ ఘటన ఆధారంగా గ్యాంగ్‌స్ట‌ర్ నేపథ్యంలో సాగే కథగా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా #Surya 43 అనే వర్కింగ్ టైటిల్ తో రన్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో నాజరియా, బాలీవుడ్ స్టార్ నటుడు విజయవర్మ ఇలా పలువురు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక గతంలో వీరిద్దరి కాంబోలో యదార్ధ గాధ ఆధారంగా తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురా పెద్ద సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు రాబోయే ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గతంలో సుధా కొంగర ఎన్నో హిట్ సినిమాలకు డైరెక్టర్గా వ్యవహరించింది. వెంకటేష్ నటించిన గురు సినిమాకు కూడా దర్శకత్వం వహించిన సుధా.. మ‌ళ్ళీ సూర్యకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.