నా కొడుకు అమర్ కు ఓటేయాలన్నా రాశి.. షాక్ లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 పై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోతుంది. ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతుందని చెప్పాలి. అయితే ఈ సీజన్‌లో విన్నర్ ఎవరనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది శివాజీ పేరు చెప్తుంటే.. మరి కొంతమంది పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు. అయితే వీరిద్దరిలోనే విజేత ఉంటారని సమాధానం ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి రాశి తాజాగా తన కొడుకు అమర్‌దీప్‌కి ఓటేయండి అంటూ కామెంట్స్ చేశారు. అమర్ సీరియల్ లో కొడుకు పాత్రలో నటించడంతో రాశి ఈ విధంగా కామెంట్లు చేశారు.

దీంతో రాశి చేసిన పోస్ట్ నెట్టింట‌ వైరల్‌గా మారింది. రాశి చేసిన ఈ పోస్ట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్లే అయింది. ప్రస్తుతం అమర్‌దీప్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాశి ఫ్యాన్స్ కూడా అమర్ కు ఓటు వేస్తే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందేమో అన్న సందేహం పల్లవి ప్రశాంత్ ఫాన్స్ లో మొదలైంది. అమర్ కి సపోర్ట్ చేయొద్దు అంటూ.. మీరు చెప్తే మేము ఓటెయ్యాలా అంటూ.. రాశికి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నేటిజెన్లు. అమర్ కుటుంబ సభ్యులను, రాశిని కూడా టార్గెట్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మరోసారి నెగిటివ్ కామెంట్స్ తో ఆడుకుంటున్నారు.

ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కామెంట్‌లపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే అతని వరకే చూసుకోండి ఫ్యామిలీ పర్సన్స్‌ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళను కూడా ఎందుకు నెగిటివ్‌గా ట్రోల్స్ చేస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంతమంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌ని సమర్ధిస్తున్నారు. ఇక‌ ఎలాగైనా ఈ సీజ‌న్ సక్సెస్ చేయాలని ఉద్దేశంతో మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం రాశి చేసిన కామెంట్లు వైరల్ కావడంతో ఇకనైనా అమర్‌దీప్‌ ఓటింగ్ రేట్ పెరుగుతుందేమో అని ఆసక్తి ప్రేక్షకుల్లో నెల‌కొంది.