వరుణ్ – లావణ్య ల వెడ్డింగ్ కార్డ్ ధర ఎంతో తెలుసా..? ఆ ఖ‌ర్చుతో ఓ పెళ్లి చేసేయొచ్చు..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ జంటలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కూడా యాడ్ అయిపోయింది. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ పలు వార్త‌లు సోషల్ మీడియాలో వైరల్ అయినా.. లావణ్య అలాంటిదేమీ లేదంటూ కొట్టిపరేసింది. కానీ ఇటీవల వీరిద్దరూ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫాన్స్ కు షాక్ ఇచ్చారు. ఇక నవంబర్ 1వ తేదిన‌ ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఈ పెళ్లికి మెగా కుటుంబ సభ్యులు మరియు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు హాజరు కానున్నారు.
ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే వరుణ్ తేజ్ ఇక్కడ మీడియాకి దూరంగా ఉండేందుకే ఈ వివాహాన్ని ఇటలీలో ప్లాన్ చేసుకున్నాడట‌. ఇదిలా ఉండగా స్టార్ సెలబ్రిటీ కపుల్ ఎంత గుట్టుగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి సంబంధించిన ప్రతి న్యూస్ సోష‌ల్ మీడియాలో క్ష‌ణాలో రీచ్ అవుతుంది.. ఇది అందరికీ తెలుసు. అలా వీళ్ళిద్దరి పెళ్ళికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ కాస్ట్ దాదాపు రూ.6 లక్షలకు పైగా ఉంటుందట.

ప్రత్యేకమైన డిజైన్‌తో ఈ వెడ్డింగ్ కార్డును డిజైన్ చేయించారట. సోషల్ మీడియాలో ఈ వెడ్డింగ్‌ కార్డ్‌ని వరుణ్ తేజ్ మరియు లావ‌ణ్య‌ షేర్ చేశారు. రూ.6 లక్షలు కేవలం వెడ్డింగ్‌ కార్డు కోసమే ఖర్చు పెట్టారంటే అది సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అంత డబ్బు ఓ మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లకు సాయం చేసి ఉంటే ఆ అమ్మాయికి పెళ్లి కూడా చేసేయొచ్చు.. ఎంత లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం కేవలం ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కే అన్ని లక్షలు ఖర్చు చేయాలా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు.