దేవర కోసం అల్లు అర్జున్ బిగ్ హెల్ప్..బావ కోసం దిగ్గి వచ్చిన బన్నీ..ఇక ఈ ఫ్యాన్స్ ఆపలేం రా బాబోయ్..!!

ఎన్టీఆర్ బన్నీ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలుఉన్నా..వీళ్లు మాత్రం బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అలా బావ అని  పిలుచుకునే ఎన్టీఆర్ – బన్నీ సినిమాల విషయంలో కూడా హెల్ప్ చేసుకుంటూ ఉంటారట . తాజాగా అదే న్యూస్ బయటపడింది . ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమా చాలా మంది ఫ్లాప్ అవుతుంది అంటూ ముందుగానే గెస్ చేసేస్తున్నారు .

రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత ఏ హీరో కైనా సరే ఫ్లాప్ పడాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ ఫ్లాప్ బారి నుంచి తప్పించుకోవడానికి బన్నీ అద్దిరిపోయే సలహా ఇచ్చారట . దేవర పుష్పలాగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తే పార్ట్ వన్ అటు ఇటు అయినా పార్ట్-2 హిట్ అవుతుందని అప్పుడు మీకు ఫ్లాప్ అన్న పేరు రాదు అంటూ సజెస్ట్ చేసారట.  ఎన్టీఆర్ కూడా ఆ ఆలోచనకు ఫిదా అయిపోయి వెంటనే కొరటాలకు దేవరను రెండు భాగాలుగా తెరకెక్కించమంటూ సజెస్ట్ చేశారట .

మొదటి నుంచి ఎన్టీఆర్ అంటే గౌరవం ఇష్టం ఉన్న కొరటాల ఆయన చెప్పినట్లుగానే ఓకే చేసేసాడు . అలా కొరటాల ఎన్టీఆర్ కి  మంచి అద్భుతమైన సలహాలు ఇచ్చాడు బన్ని. అంతేకాదు దేవర సినిమాలో కొన్ని సీన్స్ కూడా ఎన్టీఆర్ కి కొరటాలకు ఈ విధంగా తెరకెక్కించమంటూ సజెస్ట్ చేస్తున్నారట . మొత్తానికి దేవర సినిమాలో వేలు పెట్టి బన్నీ సైతం దేవరలో భాగం అయిపోతున్నాడు . ఇక రచ్చ రంబోలానే అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు..!!