బాల‌య్య.. భగవంత్ కేసరిని రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఇలీవ‌ల న‌టించిన మూవీ భ‌గ‌వంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. బాలయ్య – అనిల్ కాంబోలో వ‌చ్చిన భగవంత్‌ కేసరి బాలయ్య కెరీర్‌లోనే లాంగ్ రన్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటగా అనిల్ రావిపూడి భగవంత్ కేసరికి అనుకున్న హీరో బాలయ్య కాదట. ఈ సినిమాను మొదటగా అనిల్ చిరంజీవికి వినిపించినట్లు తెలుస్తుంది.

ఇక స్టోరీ విన్న చిరు సినిమాలో కొన్ని చేంజెస్ చెప్పారట. వాటిని చేంజ్ చేయగలిగితే నేను ఈ సినిమాలో నటిస్తానని అనిల్ రావిపూడి తో చెప్పినట్లు సమాచారం. కానీ ఆ సీన్లు సినిమాకి కీలకమైన సీన్లు కావడంతో వాటిని మార్చలేక అనిల్.. ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టాడు. వెంటనే ఎఫ్ 3 సినిమాను తెరకెక్కెంచాడు. సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక దాంతో మళ్ళీ ఆ స్టోరీని బయటకు తీసి బాలయ్య బాబుకు చెప్పి ఒప్పించి.. భగవత్ కేసరి సినిమాను తరికెక్కించాడు. బాలయ్య ఈ స్క్రిప్ట్ ని పూర్తిగా నమ్మి అనిల్ రావిపూడి కి అవకాశం ఇవ్వడం వల్ల ఈ సినిమా సక్సెస్ అందుకుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.

నిజానికి అనిల్ రావిపూడి అంటే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇలాంటి డైరెక్టర్ మాస్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా పిలుచుకునే బాలయ్య బాబుని ఎలా చూపిస్తాడు.. అనే సందేహాలు రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. అయితే ప్రస్తుతం బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాను చిరంజీవి రిజెక్ట్ చేశాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం చిరు ల‌క్ అసలు బాలేదని ఫ్లాప్ లతో వెళ్తున్న చిరంజీవి ఈ కథను ఓకే చేసి ఉంటే మరో హిట్ తన ఖాతాలో పడి ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.