ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ వరుస పెట్టి ఖరీదైన కార్లు కొనుకుంటున్నారు. హీరోల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదంటూ హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు పెట్టి మరీ లగ్జరీ కార్లు సొంతం చేసుకుంటున్నారు. ఇక ఈ విజయదశమి సందర్భంగా స్టార్ బ్యూటీస్ అందరూ కలిసి కార్లు కొనాలని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఒకరి తర్వాత మరొకరు వరుస పెట్టి లగ్జరీకారులను కొంటున్నారు. ఇప్పటివరకు శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే కోట్లు కుమ్మరించి మరి లగ్జరీ కార్లను తమ ఇంటికి తీసుకెళ్ళారు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఈ జాబితాలోకి బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా యాడ్ అయిపోయింది. దసరాకు సోనాల్ చౌహాన్ కూడా ఓ లగ్జరీ కారును కొన్నారని న్యూస్ వైరల్ అవుతుంది. రూ.90 లక్షల విలువ చేసే మెర్సడేస్ బెంజ్ కారును సోనాల్ తన ఇంటికి తెచ్చుకుందట. జన్మత్ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సోనాల్ చౌహాన్ ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ సరసన నటించింది. ఆ తర్వాత రెయిన్బో సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణతో నటించిన లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల్లో పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించింది.
తర్వాత నాగార్జున డిజాస్టర్ మూవీ గోస్ట్ లో కనిపించింది. యాక్టింగ్ కంటే తన గ్లామర్ షో తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో మండోదరి పాత్రలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల సినిమా అవకాశాలు రాకపోవడంతో కేవలం అడపా దడపా సినిమాల్లోనే వచ్చిన రోల్స్‌లో నటిస్తూ సర్దుకుపోతుంది. ఇక ప్రస్తుతం దర్ధ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సినిమాలో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ హాట్ ఫోటోలతో కుర్రాళ్ళను కవ్విస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
View this post on Instagram