రతికకు ఇంకా బుద్ధి రాలేదా.. మళ్లీ అదే తప్పు చేస్తుందే.. ఈ జన్మకు మారదు రా బాబు..!!

బిగ్ బాస్ 7 సీజన్ ఇంతక ముందు షోలతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. గొడవలు, తిట్టుకోవడం ఎక్కువయ్యాయి. అదే టైంలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కిందామీద పడుతున్నారు. తాజాగా కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఫైనల్ టాస్క్ ఒకటి పెట్టగా.. అందులో శోభా శెట్టి హైలెట్ అయింది. అదే టైంలో ఆమె వల్ల రతిక బండారం బయటపడింది.

ఇక కెప్టెన్సీ కంటైనర్ షిప్ రేస్ లో ఉన్న ఐదుగురులో ఎవరిని కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటారో వారి మెడలో ఎండు మిర్చి దండ వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే ఈ టాస్క్ లో రతిక, శోభా శెట్టి అనర్హురాలు అని మిర్చి దండ వేయడాన్ని తట్టుకోలేకపోయింది. హౌస్ లో మాటలు మారుస్తూ అందరి ఆట చెడగొడుతున్నావ్ అంటూ శోభ కి మిర్చి దండ వేసింది. దండ వేసిన రతిక ఏదో చెప్పాలి అని ప్రయత్నించింది. కానీ శోభ ఊరుకోలేదు.

దీంతో చాలాసేపు గొడవ జరిగింది. ” నిన్న నువ్వు నాతో ఏమన్నావ్.. లేడీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని, అన్నావు కదా. ఇప్పుడు నువ్వే దండ వేశావు ” అని రతిక నిజస్వరూపాన్ని బయట పెట్టింది శోభ. ఇది జరిగిన తరువాత రతిక గురించి శోభా, అశ్విని చర్చించుకున్నారు. రతికా ఏంటి? దెయ్యంలా అంత తింటుంది? అని అశ్విని చెప్పుకొచ్చింది. ఆమె తినడం, తిరగడం, మాట్లాడడం తప్ప హౌస్ లోకి ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియడం లేదు అంటూ శోభ మండిపడింది.