బిగ్ బాస్‌ 7 షాకింగ్ ట్విస్ట్ ఈవారం ఎనిమినేట్ అయ్యేది తేజ కాదు.. ఆ టాప్ సెలబ్రిటీ..!!

బిగ్‌బాస్ సీజన్ 7 మొదటి ఎపిసోడ్ నుంచి గొడవలతో, ఎమోషన్లతో సాగుతుంది. ఈ షోలో ఇప్పటివరకు 4 ఎలిమినేషన్లు కాగ‌ 4 వారాలు లేడీ కంటెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఈ వారం ఓటింగ్ ప్రకారం తేజా ఎలిమినేట్ కావాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హౌస్ లోనే టాప్ సెలబ్రిటీ ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోవడం ఖాయం అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 14 మంది కంటెస్టెంట్ తో సీజన్ 7 మొదలు కాగ‌ కిరణ్ రాథోడ్, షాకీలా, దామిని, రతిక వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారానికి ఏడుగురు కంట్రీస్ నామినేషన్ లో ఉన్నారు.

పవ‌ర్అస్త్రా గెలుచుకున్న సందీప్, శోభశెట్టి, పల్లవి ప్రశాంత్ తప్పించి మిగతా వారంతా నామినేట్ అయ్యారు. శోభాశెట్టి నిర్ణయంతో పవ‌ర్ అస్త్రా కోల్పోయిన శివాజీ నామినేషన్స్ లోకి వచ్చాడు. టాస్క్ లో గౌతమ్ ని కొట్టిన తేజను హోస్ట్ నాగార్జున నేరుగా నామినేట్ చేశాడు. శివాజీ, తేజ తో పాటు అమర్, ప్రిన్స్ యావర్, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ నామినేట్ అయ్యారు. మొదటి నుంచి ఓటింగ్‌లో శివాజీ దూసుకుపోతున్నాడు. అతడు అత్యధిక ఓట్లతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత స్థానాల్లో గౌతమ్‌, యావర్, టేస్టీ తేజ ఉన్నారు. అందరికంటే చివర్లో ఉన్న తేజ పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. అతడు ప్రియాంక అమరదీప్‌ను వెనక్కి నెట్టి 5వ స్థానంలోకి వెళ్ళాడట.

ఇక చివరి స్థానంలో ప్రియాంక ఉన్నారు. సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న అమర్, ప్రియాంక, శోభ శెట్టి కలిసి ఆడుతున్నారని అపవాదం ఉంది. సోషల్ మీడియా కూడా తిరిగి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీంతో టాప్ సెలబ్స్ అయినా అమర్, ప్రియాంకలకు ఆడియన్స్ తక్కువఓట్లు వేశారంటు సమాచారం. అమర్‌దీప్ కంటే ప్రియాంకకే తక్కువ ఓట్లు వచ్చాయట. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎలిమినేట్ ఖాయమంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అదే జరిగితే ఇది సెన్సేషనల్ రికార్డు అని చెప్పాలి. వరుసగా అయిదుగురు లేడు కన్సిస్టెంట్లు ఎలిమినేట్ అయినట్లు అవుతుంది అయితే ఈ రూమర్స్‌లో ఎంతవరకు నిజమందో చూడాలి.