ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ అదరగొట్టాడుగా….” మ్యాడ్ ” ఫస్ట్ డే కలెక్షన్స్…!!

నార్నే నితిన్, రామ్ నితిన్‌ అలాగే సంగీత్ శోభన్ లు మెయిన్ లీడ్ లో.. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ డ్రామా ” మ్యాడ్ ” . టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన ఈ ప్రామిసింగ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై మంచి హైప్‌ వచ్చింది.

మ్యాడ్‌కు యూత్ ని ఆకట్టుకునే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇది కంప్లీట్ కొత్త యువ నటీనటులకు ఓ సెన్సేషనల్ ఓపెనింగ్ అనే చెప్పాలి. అలాగే యూత్ కి ఎలాగో సినిమా కనెక్ట్ అయ్యింది కాబట్టి ఈ వీకెండ్ కి కూడా సాలిడ్ నెంబర్స్ నమోదు అవుతాయని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంద‌ని అంటున్నారు. ఏదేమైనా బేబీ త‌ర్వాత యూత్‌ను మెప్పించే సినిమాగా మ్యాడ్ నిల‌వ‌నుంది.