బాలయ్య కు పోటీగా దిగబోతున్న ఎన్టీఆర్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఈమధ్య కాలంలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు కూడా ఆయనకి మంచి పేరును ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి . అయితే ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న థియేటర్స్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతోంది చిత్ర బృందం.

ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 8న వరంగల్లో లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ డేట్ బయటకి వచ్చినప్పటి నుంచి భగవంత్ కేసరి ప్రమోషన్ లో వేగం పెరుగనుందట. అక్టోబర్ 18 వరకు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ కంటెంట్ ని రిలీజ్ చేయటానికి అనిల్ రావిపూడి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాకి రవితేజ టైగర్ నాగేశ్వరరావు నుంచి విజయ్ లియో సినిమా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ రెండు సినిమాలు చాలావన్నట్లు బాలయ్య కి పోటీగా ఎన్టీఆర్ వస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

NTR Jr's Adhurs set for re-release- Cinema express

అయితే ఎన్టీఆర్ వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అదుర్స్ ఈ సినిమాని అక్టోబర్ 19న రి రిలీజ్ కి రెడీ చేస్తున్నారట. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమానే మళ్లీ రీ రిలీజ్ చేయాలని ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కానీ దసరా రోజునే రి రిలీజ్ చేస్తున్నారు.. ఆ రోజునే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారు తెలియదు కానీ సోషల్ మీడియాలో అదుర్స్ టాక్ బాగానే వినిపిస్తోంది. అయితే ఈ రీ రిలీజ్ ప్రోగ్రాం పెద్ద సినిమాలు లేనప్పుడు థియేటర్లలో రిలీజ్ అయితే బానే ఉంటుంది.. కానీ పెద్ద సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇలా చేస్తే ఎలా అని నందమూరి అభిమానులు ఫీల్ అవుతారు.