స్కర్ట్ ధరించిన ముదురు హీరోయిన్ సదా.. కాస్త కురసయిందని కుర్రాళ్ళు!

టాలీవుడ్ ముదురు హీరోయిన్ సదా గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె అసలు పేరుని మీరు దాదాపుగా విని వుండరు. ఆమె పూర్తి పేరు “సదాఫ్ మొహమ్మద్ సయీద్.” నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు అనతికాలంలోనే తెలుగులో మంచి బిజీ ఆర్టిస్టుగా మారింది. జయం సినిమాలో సదా, నితిన్ ఇద్దరూ నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు.

ఇక ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ ఆమె చెప్పిన డైలాగుని ఇప్పటికీ కుర్రకారు మర్చిపోలేదు. ముఖ్యంగా సదా కెరీర్‌లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి విదితమే. అయితే ఆ మధ్య ఈ భామ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతిక చేసిన పాత్ర కోసం ముందుగా తనను మాత్రమే సంప్రదించారాట. కాగా ఆ సమయంలో ఆమె వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకుందట. ఇకపోతే హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ సదా అందం ఇసుమంత తగ్గలేదు. నాలుగు పదుల వయసులో కూడా వన్నె తరగని మేని ఛాయతో మైమరిపిస్తోందని చెప్పుకోవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళితే, మన ముదురు అందాల సుందరి సదా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా అలరిస్తూ వుంటారు. ఈ క్రమంలోనే ఆమె స్కర్ట్ ధరించి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు మాత్రం మైమరిచిపోతున్న పరిస్థితి. కావాలంటే ఇక్కడ వున్న ఫిక్స్ మీరే చూడండి మరి!