బిగ్ బాస్ 2.0 లాంచ్.. ఒకేసారి ఐదుగురు కంటిస్టెంట్లు.. ట్విస్ట్ అదేనా..?

బిగ్ బాస్ ఆట రసవక్తంగా సాగుతుంది అనే లోపే మళ్ళీ చప్పబడింది. మ‌రో పక్క హౌస్ లో ఉన్న గ్లామర్ బ్యూటీ లను వరుసగా పంపించేయడంతో కలర్ ఫుల్ గా కూడా కనిపించడం లేదు. నలుగురు అమ్మాయిల ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో పదిమంది మాత్రమే మిగిలారు. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్లే ఈ సీజన్లో కూడా ఉండబోతుంది. కానీ ఈసారి ఎవరు ఊహించని రేంజ్ లో జరగబోతుంది.

ఒకరిద్దరూ కాదు ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లబోతున్నారు. ఈ విషయమే వెల్లడిస్తూ తాజాగా స్పెషన్ ప్రోమో రిలీజ్ అయింది. ” ఈ సీజన్లో ఎప్పుడూ.. ఎక్కడా జరగనటువంటి విషయాలు జరుగుతాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టా.. గుర్తుంచుకోండి ” అనీ నాగ్ అసలు విషయం బయటపెట్టాడు. బిగ్ బాస్ 2.0 మినీ లాంచ్ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుందని పేర్కొన్నాడు. దీంతో అభిమానులు తెగ ఎగ్జైట్‌ అవుతున్నారు.

బిగ్ బాస్ గేమ్స్ సరిగా ఆడిస్తున్న హౌస్ లో ఉన్నవాళ్లు మాత్రం దీన్ని చెడగొడుతున్నారని.. ఈ కొత్త కంటెస్టెంట్లు రాకతో అయినా షోలో మజా వస్తుందేమో చూడాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రోమోలో కొందరు ప్రేక్షకులు కొన్ని తప్పులను ఎత్తి చూపుతున్నారు. ” కొందరు కంటిస్టెంట్లు డ్యాన్స్ చేస్తుండగా అక్కడక్కడ క్లిప్పింగ్ లు వదిలారు. కొన్ని అది గత సీన్ లో కంటెస్టెంట్లు చేసిన డ్యాన్స్.. ప్రోమో ఎడిట్ చేయడం కూడా రాదా ” అని విమర్శిస్తున్నారు.