రజనీకాంత్ 170 సినిమా నుంచి లీకైన ఫొటోస్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత తన స్థాయికి తగ్గట్టుగా విజయాన్ని జైలర్ సినిమాతో అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రజినీకాంత్ ను మళ్లీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని గతంలో కూడా వార్తలు వినిపించాయి. ఆయన సినిమాలలో నటించడం కోసం ఎక్కువగా డూప్స్ ని ఉపయోగిస్తూ ఉంటారని విమర్శలు కూడా చేసిన వారు ఉన్నారట.

అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో రజనీకాంత్ కు సంబంధించి కొన్ని లీకుడు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే విమర్శకులు సైతం నోరెళ్లపెట్టేలా కనిపిస్తున్నాయి. రజనీకాంత్ 170 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ TJ .జ్ఞానవెల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలకు రజనీకాంత్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. రజినీకాంత్ ఫోటోలు బయటకు రావడంతో తెలుగు తమిళ్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలు

Rajinikanth Kovalam photo goes viral on social media

షర్టు లేకుండా వైట్ గడ్డంతో షార్ట్ లో రజనీకాంత్ ఫిజిక్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. రజనీకాంత్ కు ఈ స్థాయిలో ఫిజిక్ ఉందా లేకపోతే ఏదైనా గ్రాఫిక్స్ ఆ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ తో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం ఇది రజనీకాంత్ ఫిట్నెస్ బాడినే అంటే పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. రజనీకాంత్ 170 సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో రితికా సింగ్, మంజు వారియర్, దుశారా విజయ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.