BB 7: వాడో వరస్ట్ కంటెస్టెంట్.. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది అతడే..?

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యి 4 వారాలు పూర్తికావొస్తుంది. బిగ్ బాస్ చూసే వాళ్లంతా హౌస్ లో ఇప్పటికే రెండు గ్రూప్ లు ఫార్మయ్యాయి అని అంటున్నారు. అందులో ఒకటి స్టార్ మా బ్యాచ్, మరొకటి శివాజీ బ్యాచ్. అయితే శివాజీ బ్యాచ్ లో ప్రశాంత్, యావర్, శివాజీ మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లంతా ఒక బ్యాచ్. అందుకే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఇంటికీ సభ్యుడిగా అనర్హుడు ఎవరో చెప్పమని అడిగితే ప్రిన్స్, యావర్ తప్పా మిగిత వాళ్లంతా శివాజీ కె ఓటు వేసారు.

దీనిబట్టి చూస్తే స్టార్ మా బ్యాచ్ శివాజీ ని ఎంతలా టార్గెట్ చేసారో అర్ధం అవుతుంది అని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవర్ అస్త్రా కంటెండర్షిప్ లో పోటీ పడుతున్న శుభశ్రీ, ప్రిన్స్, ప్రశాంత్ లాని డైవర్ట్ చెయ్యడం కోసం రతిక, అమర్ దీప్ ప్రయత్తించారు. ముఖ్యంగా ప్రశాంత్ ని టార్గెట్ చేసిన రతిక ప్రశాంత్ ఇంటి సభ్యుల గురించి కూడా గౌరవం లేకుండా మాట్లాడింది. ఆమె చేసేది తప్పు అని చెప్పకుండా అమర్ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ మాట్లాడం తో వారిద్దరి పై నాగార్జున ఫైర్ అయ్యాడు. దాంతో ఆడియన్స్ కూడా అమర్ ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. కొంతమంది అయితే వాడొక వరస్ట్ కంటెస్టెంట్, కచ్చితంగా ఈసారి ఆమె ఎలిమినేట్ అవుతాడు అని అంటున్నారు.

ఇక టేస్టీ తేజ, గౌతమ్ పై ఒక గేమ్ లో ఫిజికల్ గా దాడి చెయ్యడం తో నాగార్జున ఇంటిసభ్యుల నిర్ణయం మేరకు తేజ కి జైలు శిక్ష విధించడం తో పాటు గా వచ్చే వారం డైరెక్ట్ గా నామినేట్ చేస్తారు. ఇంకోసారి అలానే జరిగితే రెడ్ కార్డు ఇచ్చి ఇంటికీ పంపించేస్తా అని తేజ కి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఈ వారం వోటింగ్స్ ని బట్టి తేజ, రతిక ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటే కచ్చితంగా తేజ, రతిక హౌస్ నుండి బయటకి వెళ్ళిపోతారు. మరి ఒకరు ఎలిమినేట్ అవుతారా లేదంటే ఇదరా అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.