రతిక ఎలిమినేషన్ పై షాకింగ్ ట్విస్ట్… సీక్రెట్ రూమ్ లోకి పంపించాలని రిక్వెస్ట్…!!

తెలుగు బిగ్ బాస్ నాలుగో వారం ప్రసారం అవుతుంది. వీకెండ్ ఎపిసోడ్ కొనసాగుతోంది. ప్రతివారం ఊహించని విధంగా ఎలిమినేషన్స్ అవుతున్నాయి. కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. అయితే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారని విషయం ఒకరోజు ముందుగానే తెలుస్తుంది. ఈరోజు ఆదివారం (అక్టోబర్ 1)న రతిక రోజ్ హౌస్ నుంచి బయటకు వచ్చాయి ఉందని సమాచారం.

ఈ క్రమంలోనే షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. రతిక అఫీషియల్ ఖాతాలో చేసిన ఓ ఇన్స్టా పోస్ట్ వైరల్ గా మారింది. అందులో ” రతిక ఎలిమినేట్ కానుంది అంటూ ఒక అప్డేట్ వచ్చింది. కానీ తన హౌస్ లో ఉండాల్సిన కంటిస్టెంట్. టాప్ 3లో ఉండేందుకు అర్హత ఉన్న కంటిస్టెంట్. అమర్ దీప్ లాంటి కొందరు నెగిటివ్ వ్యక్తుల వల్ల తను తప్పుడు దారిలో నడిచింది. ప్లీజ్.. తనకు ఒక ఛాన్స్ ఇచ్చి ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపించండి. తన వెనకాల ఏం జరుగుతుందో ఈ గేమర్ కు తెలియాలని ఉంది. ఎవరు తన మంచి కొరతారు? ఎవరు తన చెడు కొరతారో? తనకు తెలియాలి.

రతిక చాలా మంచి అమ్మాయి. అమర్దీప్ లాంటి వాళ్లు నిన్ను వాడుకున్నారు”అంటూ రాస్కొచ్చారు. దీంతో అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడంటూ ఫైర్ అవుతున్నారు. రతిక ఇంస్టాగ్రామ్ ను హ్యాండిల్ చేస్తున్న వారికి ఇది బిగ్ బాస్ రూల్స్ కు విరోధం అని కూడా తెలియదా అని కామెంట్ చేస్తున్నారు. ఇంతలోనే ఈ పోస్టును డిలీట్ చేశారు. కానీ స్క్రీన్ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.