హీరో సిద్ధార్థ కు పెరుగుతున్న మద్దతు….. ఒక్కొక్కరుగా గాలం విసురుతున్న నటులు….!!

తమిళ్ హీరో సిద్ధార్థ్ పో మూవీ ప్రెస్ మీడియాలో పాల్గొన్నప్పుడు నిరసన సెగ ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన స్టేజ్ పై మాట్లాడుతుండగా.. నిరసన కారులు ఆయన్ని అడ్డుకున్నారు. అంటే కాకుండా ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి మీడియా సమావేశం నుంచి పంపించేశారు. అయితే.. బెంగళూరులో సిద్ధార్థ కు జరిగిన ఈ అవమానంపై సినీ తారలు ఒక్కరుగా స్పందించారు.

ఇటీవల ప్రకాష్ రాజ్ తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా స్పందించారు. ” కావేరి సమస్య ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. అప్పటినుంచి మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు నటులు ముందుకు రారు అంటున్నారు. మేము వస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందా? ” అని శివరాజ్ కుమార్ అన్నాడు.

ఈ క్రమంలోనే సిని ప్రముఖు నుంచి సిద్ధార్థ కు మద్దతు లభిస్తుంది. ఇక కొందరు సోషల్ మీడియా వేదికగా కాకుండా పర్సనల్గా కూడా జరిగిన విషయాన్ని తప్పుపడుతున్నారు. ఈ మేరకు సిద్ధార్థ కు ఇంకా మద్దతు పెరిగే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది.