బొమ్మరిల్లుకు మించిన హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తి రేపుతున్న “చిన్నా” ట్రైలర్…

ప్రముఖ నటుడు సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమా లో నటించిన సిద్ధార్ధ బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాతో మంచి పాపులరిటీ సంపాదించుకున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి మరోవైపు లవర్ బాయ్ గా అమ్మాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ ‘ చిన్నా ‘ అనే సినిమా లో నటించిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

ట్రైలేరు చూసిన ప్రతీ ఒక్కరిలో సరికొత్త ఆలోచనలను రేకేత్తిస్తుంది. ఎషియాన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల అవుతున్న ఈ సినిమాని ఏటాకి ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఇక సిద్ధార్థ మునుపేన్నడు నటించని సరికొత్త పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. మేనమామ కి మేనకోడలికి మధ్య ఉన్న అనుబందాని చాలా అద్భుతంగా చూపించారు ఈ చిన్నా సినిమా లో. ముఖ్యంగా ఈ సినిమా లో సిద్ధార్థ్ నటన అందరిని ఆకర్షస్తుంది.

ఇక సినిమా ద్వారా సిద్ధార్థ్ కి ఉన్న అంకితభావం, నమ్మకం ఈ సినిమా ద్వారా వ్యక్తం అవుతుంది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్ చుసి ప్రేక్షకులకు ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా తో సిద్ధార్థ్ కచ్చితంగా హిట్ కొడతాడని అంత భవిస్తున్నారు.