బీచ్ ఒడ్డున కత్తిసాము చేస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సదరు హీరో.. అంచలంచలుగా ఎదుగుతూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేశాడు. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటికైనా ఆ హీరో ఎవరో గెస్ చేశారా.. నిఖిల్ సిద్ధార్థ. ప్రస్తుతం ఈయన `స్వయంభూ` పేరుతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్కీ బ్యూటీ సంయుక్త హీనన్ హీరోయిన్ గా చేస్తోంది. సోసియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న స్వయంభూలో నిఖిల్ ఒక యోధునిగా కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం నిఖిల్ కత్తిసాము నేర్చుకుంటున్నాడు. ఇందుకు ఆయన వియత్నాం వెళ్లారు. అక్కడ సముద్ర తీరంలో నిఖిల్ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా, స్వయంభూతో పాటు నిఖిల్ `ది ఇండియా హౌస్` అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండటం విశేషం.