టీతో పాటు ఈ ఫుడ్స్ కూడా కలిపి తింటున్నారా.. వద్దు బాబోయ్ వద్దు ..ఎంత డేంజర్ అంటే..!

ప్రస్తుత కాలం బట్టి చూసుకుంటే ప్రతి ఒక్కరికి టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి టీ తో పాటు బిస్కెట్స్, జంతికులు, అప్పడాలు లాంటి అనేక రకమైన ఆహారాలను టీతో తింటుంటారు. అయితే ఇవి కొన్ని కొన్ని సార్లు ప్రమాదానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. టీతోపాటు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది.

దానివల్ల ప్రస్తుతం ఇబ్బందులు కలగకపోయినా.. రానున్న కాలంలో చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు టీలో చేర్చుకుని తినవద్దు. అలా తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్య బారిన పడతారు. అలాగే మసాలాలు అధికంగా ఉండే ఫుడ్ ను టీ లో మంచింగ్ కి తీసుకుంటే జీర్ణ శక్తిపై ప్రభావం చూపిస్తాయి.

ఛాయతో కలిపిన పాల పదార్థాలు తీసుకోవద్దు. ముఖ్యంగా పన్నీరు, జున్ను, పెరుగు వంటివి కలిపిన ఆహారాలు అస్సలు తీసుకోవద్దు. మన జీవితంలో ఎన్ని ఉన్నప్పటికి ఆరోగ్యం లేకపోతే ఏదీ సాధించలేము. అందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవారు అంటుంటారు.