తెలుగు స్టార్ హీరో ఇంటికి కోడలు కావాల్సిన అర్జున్ కూతురు..మొత్తం ఫిక్స్ అయ్యాక క్యాన్సిల్..ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు కొంతమంది హీరోయిన్లు హీరోలు.  ఈ క్రమంలోనే తాజాగా మరో యంగ్ హీరోయిన్ సైతం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. తెలుగు తమిళంలో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్  కూతురు ఐశ్వర్య అభిమానులకు సుపరిచితురాలే.  ఈ బ్యూటీ రీసెంట్గా తన నిశ్చితార్థాన్ని ఘనంగా జరుపుకునింది .

ఐశ్వర్య కొన్నాళ్ల నుంచి తమిళ్ స్టార్ కమెడియన్ కొడుకుతో ప్రేమాయణం  నడుపుతుంది అంటూ వార్తలు వినిపించాయి . వాటిని అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ ఎంగేజ్మెంట్ చేశారు కుటుంబ సభ్యులు . కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఐశ్వర్య  ప్రేమలో పడింది . ఎప్పుడు..? ఎలా..? మొదలైందో తెలియదు కానీ వీళ్ళ ప్రేమ చాలా ఘాటుగా పాతుకు పోయింది .

దీంతో ఇంట్లో పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం చేసుకున్నారు ఈ జంట . వాళ్ళ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇదే క్రమంలో అర్జున్ తన కూతుర్ని ఓ బడా ప్రొడ్యూసర్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. అర్జున్ తెలుగులో ఓ బడా ప్రొడ్యూసర్ కి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ ..ఈ క్రమంలోనే ఆ బడా ప్రొడ్యూసర్ కొడుకు అయిన యంగ్ హీరోకి తన కూతురు ఐశ్వర్యాన్ని ఇస్తే బాగుంటుంది అని ఫ్రెండ్షిప్ బంధుత్వంగా మారుతుందని ఆశపడ్డారట . అయితే ఇంతలోనే ఐశ్వర్యరాయ్ ప్రేమ వ్యవహారం బయటపడడంతో బిడ్డ ఆనందం కోసం ఈ పెళ్లిని వద్దనుకున్నాడు అర్జున్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!