హీరోయిన్ త్రిష ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లుకమ్మల్సిందే..!!

టాలీవుడ్ , కోలీవుడ్ లో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వర్షం సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ దాదాపుగా 20 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. మధ్యలో వివాహం చేసుకోవాలని ప్రయత్నించిన ఎంగేజ్మెంట్ వరకు వచ్చి వివాహం క్యాన్సిల్ కావడం జరిగింది. దీంతో మళ్ళీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సిరీస్ లతో మంచి పాపులారిటీ అందుకున్నది.ఇందులో ఈమె పాత్ర అందం ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పవచ్చు. ఇటీవలే విజయ్ నటించిన లియో సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పటివరకు త్రిష దాదాపుగా 100 కోట్లకు పైగా ఆస్తిని సంపాదించినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. లియో చిత్రానికి ఏకంగా 4 కోట్ల రూపాయల తీసుకున్నట్లు సమాచారం. ఇక మీదట ఎంచుకోబోయే ప్రాజెక్టులకు ఇంతకు డబల్ ఓ తీసుకోబోతుందని సమాచారం.

త్రిష ప్రతి బ్రాండ్ కు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ నెలకి 70 లక్షలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారుగా ఏడాదికి 12 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు సమాచారం. చెన్నైలో 7 కోట్లు విలువైన ఒక భవనంతో పాటు హైదరాబాదులో 6 కోట్లు విలువైన ఒక భవనం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈమె దగ్గర పలు లగ్జరీ కార్లతో పాటు బైకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా పలు రకాల ల్యాండ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.