మంచు విష్ణు కన్నప్ప మూవీలో మరో స్టార్ హీరో..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో ఇప్పటికే సౌత్ లోని టాప్ స్టార్స్ అంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా, నయనతార, మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌, మధుబాల కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ప్రభాస్ శివుని గెటప్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ సినిమాపై మరింత ఆశ‌క్తి పెరిగింది.

దీంతో పాటే మరో స్టార్ హీరో ఎంట్రీ అంటే ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇంతకీ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. కన్నప్ప సినిమాలో నటించబోతున్నాడట. ఈ మూవీలో శివన్న ఓ ముఖ్య పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జైలర్ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు కొట్టేసిన శివన్న.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

అయితే శివన్న కన్నప్ప సినిమాలో నటించబోతున్న విషయాన్ని మంచు విష్ణు హర హర మహాదేవ అంటూ కన్ఫామ్ చేశాడు. తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్‌ నుంచి స్టార్స్ ని తీసుకోవడం పూర్తయింది. మరి ఇక ఈ ప్రాజెక్టు కోసం నెక్స్ట్ బాలీవుడ్ నటులను తీసుకోవడమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమాకు హిందీ నటల నుంచి ఎవరు ఇంట్రీ ఇస్తారో చూడాలి. కాగ మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ నూపూర్ స‌న‌న్‌ను తీసుకున్నారు. కానీ త‌ర్వాత న‌య‌న్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.