తన భర్త నుంచి విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన నటి మౌనిక రెడ్డి..!!

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన నటి మౌనిక రెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. కొన్ని సినిమాలలో కూడా ఈమెకు ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అంతలోనే తన పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని మొదలుపెట్టడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో తన స్నేహితుడు సందీప్ కూరపాటిని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె ఈమె పెళ్లి వేడుకలు రెండు రోజులు గోవాలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగాయి.

గత రెండు రోజుల నుంచి తన భర్త నుంచి విడిపోతున్నట్లు పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా మౌనిక రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో నుంచి పెళ్లి ఫోటోలను హైడ్ చేసినట్లుగా ఉండడంతో తన అకౌంట్లో ఆ ఫోటోలను డిలీట్ చేసిందని విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో మౌనిక రెడ్డి, సందీప్ పైన పలు రకాల వార్తలు మొదలయ్యాయి. మౌనిక రెడ్డి విడాకుల వ్యవహారంతో ట్రెండింగ్ లో నిలిచింది.అయితే తాజాగా ఈ విషయం పైన మౌనిక రియాక్ట్ కావడం జరిగింది.

తన ఇంస్టాగ్రామ్ స్టోరీలలో ఒక పోస్ట్ షేర్ చేస్తే తన హస్బెండ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తనకి తన హస్బెండ్ కి మధ్య జరిగిన సంభాషణను షేర్ చేసింది.. మనం ట్రెండింగ్ లో ఉన్నాం అని మౌనిక చెప్పగా తన భర్త రియాక్ట్ అవుతూ ఏపీఆర్ ఐనా మంచి పిఆర్ గా అంటూ సరదాగా బదులించారు.. అలాగే ఈ పోస్టులు సోషల్ మీడియాలో ఏవేవో వస్తున్నాయి అవి పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్లిపోవడమే అంటూ రాసుకుంది. దీంతో ఎట్టకేలకు రూమర్లకు పుల్ స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు.