కల్పికాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమటం..!

కల్పికా గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది . ఇక సినిమాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపు కంటే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అభినవ్ గోమటం మీద చేసిన ఆరోపణల ద్వారానే మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని , తనను వేధించారని ఇన్స్టాగ్రామ్ లో అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా ఆరోపణలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాదు ఆయనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసిన కల్పిక.. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ ఆమెపై కూడా పడిందని చెప్పవచ్చు. దీంతో సోషల్ మీడియాలో కూడా ఆమెపై నెగెటివిటీ బాగా స్ప్రెడ్ అయ్యింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సోషల్ మీడియాలో కల్పిక కనిపించకపోయేసరికి అభినవ్ గోమటం వివాదాన్ని కూడా అందరూ మరిచిపోయారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభినవ్ గోమటం అసలు కల్పితతో ఎఫైర్ ఏంటి? అని అడిగిన ప్రశ్నకు చాలా క్లారిటీగా సమాధానం తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. ఆమె ఒక స్నేహితురాలు.. నటిగా మాత్రమే నాకు తెలుసు.. ఇక మా మధ్య లవ్ గివ్ అదంతా లేదు . ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి చాట్ చేసే వాళ్ళము.. అయితే కిందటేతేడా అదే నవంబర్లో ఒక సంఘటన జరిగింది దీంతో ఆమె బయటకు వచ్చి ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు కదా.. ఇక ఆమెతో ఎటువంటి ఎఫైర్ లేదు.. జస్ట్ ఆమె ఒక ఫ్రెండ్ మాత్రమే అంటూ తెలిపాడు అభినవ్.