కొత్త కారు కొన్న ఆషు రెడ్డి.. హ్యాపీగా ఉందన్న వేణు స్వామి..!!

కెరియర్ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి పాపులర్ సంపాదించుకుంది అషు రెడ్డి.. ముఖ్యంగా సమంతకు దగ్గర పోలికలు ఉండడంతో జూనియర్ సమంత గా కూడా గుర్తింపు సంపాదించుకొని మరిన్ని అవకాశాలను అందుకుంది. అలా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకొని అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర ప్రేక్షకులను కూడా అప్పుడప్పుడు అలరిస్తూ పలు షోలకు వెళుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందాలతో అందరిని మాయ చేస్తూ ఉంటుంది అషు రెడ్డి.

ప్రతి టాస్క్ లో కూడా ఎంతో యాక్టివ్గా కనిపించినప్పటికీ బిగ్బాస్ తర్వాత కొద్ది రోజులకే రాంగోపాల్ వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ గా మారింది.. సినిమాలు లేకున్నప్పటికీ ఈమె ఎక్కువగా విదేశాలకు వెకేషన్ వెళుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఏమి వార్తలలో నిలవడం జరిగింది ఎందుకంటే అషు రెడ్డి తాజాగా ఒక రేంజ్ రోవర్ కారును లక్షలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఆ కారుకు ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామితో పూజలు చేయించి దిష్టి తీసి పూజ చేయిస్తున్నట్లు ఒక వీడియో వైరల్ గా మారుతోంది .తనను నమ్మిన వారు ఇలా వృద్ధిలో వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని ఆ ఆనందం మామూలుది కాదని తెలియజేశారు.. వేణు స్వామి ప్రముఖ హీరోయిన్లకు కూడా అనేక పరిహార పూజలు చేయడం జరిగింది. వేణు స్వామి చేతిలో పూజ చేయించుకున్న వారు వృద్ధుల్లోకి వచ్చారని చాలామంది తెలియజేస్తూ ఉంటారు.