వరుణ్-లావణ్య పెళ్లి: ఇటలీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయిన మెగాఫ్యామిలీ మోస్ట్ స్పెషల్ పర్సన్..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ లావణ్యలకు సంబంధించిన వార్త కావడంతో ఈ న్యూస్ ఎక్కువ స్థాయిలో ట్రెండ్ అవుతుంది . కాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ త్వరలోనే లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు.  దీనికి సంబంధించిన పనులు మొత్తం పూర్తి అయ్యాయి.

మరో మూడు రోజుల్లో మిస్ లావణ్య మిస్సెస్ వరుణ్ గా మారిపోతుంది . అయితే ఈ పెళ్లి కోసం మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబం ఇప్పటికే ఇటలీ చేరుకునింది. కానీ మెగా ఫ్యామిలీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అంజనా దేవి గారు పెళ్లికి హాజరు కావడం లేదు అంటూ తెలుస్తుంది . ఆమె ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్స్ ఫ్లైట్లో అంత దూరం జర్నీ చేయకూడదు అంటూ సజెస్ట్ చేశారట .

అందుకే లావణ్య – వరుణ్ పెళ్లికి అంజనా దేవి గారు హాజరు కావడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మొబైల్ లో వీడియో కాల్ ద్వారా వాళ్ల పెళ్లి చూడబోతున్నారు అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అలా తన మనవడి పెళ్లి డైరెక్ట్ గా చూడలేకపోతుంది చిరంజీవి తల్లి..!!