ప్యారిస్ లో ఫ్రెండ్ పెళ్లిలో మెరిసిన చెర్రీ – ఉపాసన.. అదిరిపోయే రాయులుకులో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట ఇటీవల ఓ పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసన ఆడపిల్లకి జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ ఇటీవల తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాడు. అదేవిధంగా ఉపాసన కూడా తన తాత అధినేతగా వ్యవహరిస్తున్న అపోలో సంస్థలో కీలక పొజిషన్లో రాణిస్తుంది. ఇక పాప పుట్టిన మొదటిసారి చరణ్ – ఉపాసన కలిసి పారస్‌కి వెళ్లారు.

తాజాగా వెడ్డింగ్‌కి రాయల్ లుక్‌లో హాజరై ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ – ఉపాసన కోణెదలా వారి స్నేహితుడు రోస్మిన్ మాధవ్ జి వివాహానికి హాజర‌యేందుకు ప్యారిస్‌కి వెళ్లారు. ఇక వెడ్డింగ్ లో ఆకర్షణీయ‌మైనా దుస్తులతో మెరిసారు చర్రీ – ఉపాసన. రాయల్‌లుక్‌లో అందరిని ఆకట్టుకున్న ఈ కపుల్ మ్యాచింగ్ రంగులులో గ్రాండ్ లుక్ తో అదరగొట్టారు. ఫ్యాషన్ విషయంలో రామ్ చరణ్ యూత్ ఐకానిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ఆస్కార్ వేడుకల్లో చర్రీ అవుట్‌ఫిట్ చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉపాసన కూడా చెర్రీ బాటలోనే రాయల్‌లుక్‌లో మెరిసింది. ఇక వీరిద్దరూ చాలా కాలం తర్వాత ఇలా రాయల్‌లుక్‌లో మెరవడంతో ఫాన్స్ ఆ పిక్స్ వైరల్ చేస్తూ ఫుల్ ఖుషి చేసుకుంటున్నారు. చరణ్ గోధుమ రంగు అనార్కలి సూట్ ను ధరించి సన్ గ్లాసెస్‌తో.. ఉపాసన కూడా మ్యాచింగ్ వేరులో ఆకట్టుకున్నారు అటు స్టైలిష్ గాను ఇటు సంప్రదాయంగాను డిజైన్ చేయడంతో వెడ్డింగ్ లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి మీరు ఓ లుక్ వేయండి.