సూపర్ స్టార్ మహేష్ తో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవ‌రో గుర్తుపట్టారా.. తెలిస్తే ఆశ్చర్య పోతారు..!!

ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఫొటోస్‌ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. గతంలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలను మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఆ వీడియోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా.. అంటూ సోషల్ మీడియాలో కొషన్స్ కూడా వేస్టు ఉన్నారు. ఈ విధంగా హీరో , హీరోయిన్లు, డైరెక్టర్స్ నటీనటులు ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం అనేది కామన్ అయిపోయింది.

అలాగే ఇప్పుడు మహేష్ బాబు తో కలిసి ఉన్న ఒక వ్యక్తి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటోని చూసిన అభిమానులు అతన్ని ఇట్టే గుర్తుపడుతున్నారు. పై ఫోటోలో ఉన్న ఆయన మరెవరో కాదు వేణు స్వామి. ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేణు స్వామి పేరు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయనతో పూజలు చేయించుకోవడం.. జాతకాలు చెప్పించుకోవడం లాంటివి చేస్తున్నారు. మరి ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల తరువాత నుంచి ఈయన పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

పై ఫోటో మహేష్ బాబు నటించిన యువరాజు మూవీ షూటింగ్ సమయంలోది. ఈ సినిమాకు పూజా కార్యక్రమం నిర్వహించింది వేణు స్వామినే.. ఈ ఫోటోలో మహేష్ బాబు తో పాటు దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా ఉన్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆయన చాలా సినిమాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు హీరోయిన్స్ కు ప్రముఖ పూజలు చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెబుతున్నారు వేణు స్వామి. ఇప్పటికే హీరోయిన్స్ డింపుల్ హయతి, నిధి అగర్వాల్ ఈయనతో పూజలు కూడా చేయించుకున్నారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ కూడా వేణు స్వామితో పూజలు జరిపించుకుంది.