అరవింద్ స్వామి తండ్రి అతను కాదట…..కన్న తండ్రి ఎవరంటే!!

తమిళ చిత్ర పరిశ్రమలో వన్ అఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ చార్మింగ్ యాక్టర్స్ అరవింద్ స్వామి. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ తన యౌటింగ్ తో స్టైల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అరవింద్ స్వామి. ఈయనకు తెలుగులో కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. అరవింద్ నటించిన రోజా, మెరుపు కళలు, బాంబే వంటి చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా ధ్రువ, కస్టడీ వంటి చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాడు. ఐతే ఇప్పుడు అరవింద్ స్వామి తండ్రి గురించి చర్చ మొదలయింది. అదేంటి తండ్రి గురించి చర్చ ? అనుకుంటున్నారా? ఐతే ఇది చూడండి.

అరవింద్ స్వామి తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరైనా ఠక్కున వెంకట రామ దొరై స్వామి అని చెబుతారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం అరవింద్ స్వామి తండ్రి అతను కాదని తెలుస్తోంది. అరవింద్ స్వామి అసలు తండ్రి ప్రముఖ నటుడు ఢిల్లీ కుమార్ అట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూ లో బయట పెట్టాడు. ఈ మధ్య ఢిల్లీ కుమార్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అరవింద్ స్వామి తన కొడుకే అని, కానీ వారిద్దరి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం అస్సలు లేదని, దానికి కారణం అరవింద్ పుట్టగానే తన చెల్లెలికి దత్తతు ఇవ్వడమే అని చెప్పుకొచ్చారు. ఢిల్లీ కుమార్ చేసిన ఈ shoking కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

అరవింద్ స్వామి మని రత్నం తెరకెక్కించిన దళపతి చిత్రం తో వెండితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఢిల్లీ కుంటు అరవింద్ తన కొడుకే అని చెప్పుకొచ్చారు. కానీ ఆ తరువాత దీని గురించి ఎవ్వరు ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇప్పటివరకు వీళ్లిద్దరు కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా ఎప్పుడు కనిపించలేదు. ఇదే ఇంటర్వ్యూలో మంచి కథ దొరికితే తన కొడుకు అరవింద్ స్వామి తో కలిసి నటిస్తానని అన్నారు ఢిల్లీ కుమార్.