పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా..? హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో మంచి ఫెమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య ర‌వి. 2016లో ‘ కాదల్ కనే కట్టుడే ‘ తమిళ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత అదే ఏడాదిలో ‘ కథానాయక‌న్ ‘ సినిమాలో నటించింది అయితే అతుల్య టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. కిరణ్ అబ్బ‌వారపు నటించిన ” మీటర్ ” సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో 3,4 సినిమాలను లైన్లో పెట్టుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతుల్య మారుతున్న కల్చర్, పెళ్లికి ముందే సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడగగా ముక్కుసూటి సమాధానాన్ని ఇచ్చింది. నా అభిప్రాయం ప్రకారం పెళ్లి తర్వాతే లైంగికమైన రిలేషన్షిప్ మంచిదని. ఇది మన ఆచారాలు, సంస్కృతికి అర్థం పట్టినట్లు ఉంటుందని వివ‌రించింది. ప్రస్తుతం లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ నడుస్తుందని.. దీనివల్ల చాలా మార్పులు వచ్చాయని.. ఈ జనరేషన్ లో రిలేషన్షిప్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయని.. ఒకరితో రిలేషన్ లో ఉండడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం దానిపై ఎవరికి అధికారం లేదు అని చెప్పింది.

అయితే వివాహమే అన్నిటికంటే ఉత్తమమైన రిలేషన్ అని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. ఇక అతుల్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఈ కాలంలో కూడా నీలా ఆలోచించేవారు ఉండడం చాలా గొప్ప విషయం అంటూ.. అది కూడా ఓ హీరోయిన్ అయ్యుండి ఇలా స్పందించడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ అతుల్య రవి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్‌లు.