నాకు చాలా నమ్మకం వుంది.. రవితేజ..!!

మాస్ మహారాజ్ రవితేజ హీరో గానే కాదు.. నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ నిర్మాణంలో ” ఛాంగురే బంగారు రాజా సినిమా రాబోతుంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా.. గోల్డీ నిస్సి హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులు ముందుకి రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. నా సినిమాకు సంబంధించి ముందుగా ‘ ఛాంగురే బంగారు రాజా ‘ టైటిల్ నాకు విపరీతంగా నచ్చేసింది. సతీష్ కథ చెబుతున్నప్పుడు దర్శకుడు పాత వంశీ గారు గుర్తుకొచ్చారు. ఆయనతో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా చేశాను. అలాంటి హ్యూమర్, ఈస్ట్ గోదావరి వెటకారం, కథ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి.

మొదటి నుంచి ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది. నా నమ్మకం సెప్టెంబర్ 15న ప్రూ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక్ ఇందులో చాలా ఎంటర్ టైనింగ్ రోల్ చేశాడు ” అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవితేజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.