రౌడీ హీరో విజ‌య్ ఇచ్చే ల‌క్ష కావాలా.. అయితే ఈ లింక్ పై క్లిక్ చేయండి..!!

విజయ్ దేవరకొండ – సమంత జంటగా కలిసి నటించిన మూవీ ఖుషి శివ నిర్వాణ‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజై మంచి కలెక్షన్‌ల‌ని వసూలు చేస్తూంది. సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమా సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ మీట్‌లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ 100 కుటుంబాలకు నా తరఫున కోటి రూపాయలు ఇవ్వబోతున్నా అంటూ ప్రకటించాడు.

త్వరలోనే ఆ వంద కుటుంబాలను ఎంపిక చేసి నేనే స్వయంగా వాళ్ళకి లక్ష రూపాయలు చెక్కులు అందిస్తానని చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగానే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాడు విజయ్. ఈ నేపద్యంలో ఆ లక్ష రూపాయలు కావాలంటే అభిమానులు డీటెయిల్స్ పంపించండి.. నా విజయం అండ్ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.. కాబట్టి నా సంపాదన నుంచి ఒక కోటి రూపాయలు మీతో షేర్ చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాను వంద కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాను అంటూ రాసుకొచ్చాడు.

ఈ క్రింద విధంగా అప్లై చేసుకోండి ఇది నిజంగా ఎవరికైనా సాయం చేస్తే అది నాకు చాలా సంతోషం అంటూ ఆ లింకును షేర్ చేసుకున్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ పోస్ట్ వైరల్ కావడంతో నెట్టింటా అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరో అభిమానుల కోసం ఇలాంటి ప‌ని చేయ‌లేదు మీరు మాకోసం ఆలోచించినందుకు చాలా సంతోషం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.