సోషల్ మీడియా గాసిప్స్ పై అదిరిపోయే కౌంటర్ వేసిన మెగా కోడలు..!!

టాలీవుడ్ లోకి అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి అలా తన మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న ఇమే తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇతర భాషలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు రాలేకపోవడంతో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తోంది. ఇలా నటిగా ఎంతో మంది అభిమానాలను సంపాదించుకున్న ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ తో దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రేమలో ఉండి త్వరలోనే వివాహం చేసుకోబోతోంది.

వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల గురించి వచ్చే గాసిప్స్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి..ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతోంది.

సెలబ్రిటీల గురించి వస్తున్నటువంటి ఈ వార్తల పైన స్పందించిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఇంటర్నెట్ అనేది ఒక గాసిప్ కాలానిగా మారిపోతోందని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కి చెందిన వారి గురించి కూడా ఇలాంటి గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.. అయితే ఈ గాసిప్ క్రియేట్ చేసే సమయాన్ని మీరు మీకోసం ఉపయోగించుకోండి అంటూ ఒక గట్టి కౌంటర్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి.. ఒక మనిషిని చూసి మూడు నిమిషాల లోపే జడ్జిమెంట్ ఇవ్వడం మానేయండి..మనం ఒకరి గురించి నెగటివ్గా మాట్లాడుతున్నామంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక విషయాన్ని తెలియజేసింది.. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.