ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ని కూడా ఇన్వాల్వ్ చేసిన అనుష్క.. ఈ ఛాలెంజ్ నీకే అంటూ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రూపొందిన‌ సంగతి తెలిసిందే. పి.మహేష్ డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ భాషలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌కు ఇప్పటికే నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్గా పాల్గొన్నాడు. కానీ అనుష్క మాత్రం ప్రమోషన్స్‌కు దూరంగా ఉంది. ఇక‌ ఎట్టకేలకు అనుష్క కూడా ప్రమోషన్స్‌లోకి దిగింది.

ఈ మేరకు మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో ఒక చెఫ్‌ పాత్రను పోషించడం చాలా సరదాగా అనిపించింది. ఈ రోజు నాకు ఇష్టమైన వంటకాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటునా.. దాంతోపాటు MSMP రెసిపీ చాలెంజ్ కిక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలిసినట్లుగా ఆహారాన్ని ఇష్టపడడమే కాకుండా ఇతరులు ఆహారం ఇవ్వడం ఇష్టపడే ప్రభాస్‌తో తప్ప మరి ఎవరితో చాలెంజ్ ప్రారంభించాలని నేను ఇష్టపడతాను అతనికి ఇష్టమైన వంటకాన్ని మాతో పంచుకోవడానికి.. సవాలను కొనసాగించడానికి.. అతనికి చాలెంజ్.. అంటూ ప్ర‌భాస్‌ని ట్యాగ్ చేసి రాసుకుంది.

మీరందరూ MSMP రెసిపీ చాలెంజ్‌ని స్వీకరించి మీకు ఇష్టమైన వంటకాలను నాతో షేర్ చేసుకోండి.. నేను సంతోషిస్తాను అంటూ ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో ప్ర‌భాస్‌ని కూడా అనుష్క లాగేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్‌లు.