మీనా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్నేహితురాలు..!!

కోలీవుడ్, టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా.. దాదాపుగా అందరు హీరోలతో నటించిన మీనా ఈ మధ్యకాలంలో సెకండ్ ఎంట్రీ మొదలుపెట్టి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. కెరియర్ పిక్స్ లో ఉండంగానే 2009లో మీనా బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు కూడా జన్మించింది.

Actress Meena Birthday Celebration With Kala Master🥰💖 | Kala Master  Surprise to Meena | Yogibabu - YouTube

వృత్తిపరంగా సంతోషంగా సాగుతున్న మీనా జీవితం గత ఏడాది ఒక్కసారిగా కుదిపేసింది. గత సంవత్సరం జూన్లో ఈమె భర్త విద్యాసాగర్ మరణించడంతో చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ బాధ నుంచి కోరుకొని సినిమాలతో బిజీగా అవుతున్న మీనా కెరియర్లో రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి అయితే అవన్నీ కూడా ఒట్టి రూమర్స్ గాని మిగిలిపోయాయి.తాజాగా ఈ వ్యవహారం పైన మీనా స్నేహితురాలు కాలా మాస్టర్ స్పందించి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది..

The lie told by actress Meena.. The dazzling art master.. What happened! |  Actress Meena gives surprise to Kala master on her 18th anniversary  celebration - Time News

తనకు మీనా తోనే కాదు ఆమె కుటుంబంతో కూడా మంచి స్నేహబంధం ఉంది.. తాము ఫ్రెండ్స్ గా కంటే అక్క చెల్లెలుగా ఎక్కువగా కలిసి పోయాము తనకు ఏ అవసరం వచ్చిన సరే తనని వెంటపెట్టుకొని వెళ్ళేది విద్యాసాగర్ ఆరోగ్యం బాగా లేకున్నప్పుడు కూడా మూడు నెలలు తనతోనే ఉన్నానని తెలిపింది.కానీ విద్యాసాగర్ మరణం జరుగుతుందని ఊహించలేము.మీనా భర్త మరణించాక సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది.. జీవితం ఇంకా ఉన్నది ఆ బాధ నుంచి బయటికి రావాలని ఏవేవో చెప్పి ఆమెను బయటకు తీసుకు వచ్చాము..

 

ఆ తర్వాత నెమ్మదిగా సినిమా సెట్స్ కి తీసుకు రావడం మొదలు పెట్టాను.. అప్పుడు తనతో పాటు నేను కూడా తిరిగి మామూలు మనిషిని చేశామని తెలిపింది. ఇక మీనా వయసు కూడా పెద్దగా లేకపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను కానీ వాళ్ళు తనతో గొడవ పడేవారు ముందు నీ పని నువ్వు చూసుకో లేదంటే సైలెంట్ గా ఉండు అని తన నోరు మూయించేవాళ్లు.. తనకు ఒక కూతురు ఉందని అంతకుమించి ఎటువంటి రిలేషన్ కోరుకోవడం లేదని మీనా తనతో ఉందని తెలిపింది ఆమె స్నేహితురాలు కాలా మాస్టర్.