థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్… అంతే రుచికరంగా ఇంట్లో కూడా ఈ ప్రాసెస్ తో రెడీ..

చాలామంది థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ తయారీ విధానం తెలియక బాధపడుతుంటారు. మరికొందరికి తెలిసిన సరిగ్గా రాకపోవడం లాంటివి జరుగుతాయి. వారందరికీ ఈ సింపుల్ ప్రాసెస్‌. రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ని అందంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

1. పొటాటోస్ 3

2. ఆయిల్ ,ఆఫ్ లీటర్

3. ఉప్పు తగినంత

4. కారం తగినంత

5. వాటర్

6. ఘ‌రం మసాలా తగినంత

తయారీ విధానం:

ముందుగా బంగాళదుంపల‌ను పీల్ తీసి ముక్కలను బారుగా కట్ చేసుకోవాలి. వాటిని అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత క‌డాయిలో ఆయిల్ పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్క‌ల‌ను లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత వాటిని ఫ్రీజ‌ర్‌లో పెట్టి 4 గంట‌లు వాటిని అలా ఉంచుకోవాలి (ఈ టిప్ ఖ‌చ్చితంగా పాటించాలి). ఆ తర్వాత వాటిని బ‌య‌ట‌కు తీసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మూడోసారి జస్ట్ అలా ఆయిల్లో వేసి తీసేయాలి. తరువాత వాటిపై ఉప్పు, కారం, మసాలా వేసుకుని మిక్స్ చేయాలి. ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేస్తే ఎంతో రుచికరంగా ఉంటాయి.