హైదరాబాద్ సిపిని కలిసిన బేబీ డైరెక్టర్.. ఆ సీన్‌లు సినిమా నుంచి తీయడం కుదరదు..

ఆనంద్ దేవరకొండ, విరాజ అశ్విని, వైష్ణవి చైతన్యలు హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ బేబీ. ఈ సినిమా చిన్న సినిమాగా టాలీవుడ్ వద్ద రిలీజ్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రిలీజై అక్కడ కూడా మంచి వ్యూస్ పొందుతుంది. కాగా ఈ సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సినిమాపై ఫైర్ అయ్యాడు. హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వినియోగిస్తున్న ముఠాను నార్మటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను గురువారం పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు వివరించాడు.

ఇదే క్రమంలో కమిషనర్ మాట్లాడుతూ బేబీ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. డ్ర‌గ్స్‌ ఎలా తీసుకోవాలో తెలిపే విధంగా ఈ సినిమా ఉందని మాదకద్రవ్యాలను ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాల్లో సన్నివేశాలు చూపించారని మాదాపూర్ డ్రగ్స్ కేసులో సీన్ మెమోలో పేర్కొన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దృశ్యాలను పెద్దగా తేడా ఏమీ లేకుండా ఈ సినిమాలో చూపించారు అని ఫైర్ అయ్యాడు. ఇలాంటి అభ్యంతర సన్నివేశాలు చిత్రీకరించవద్దని సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో బేబీ సినిమా నిర్మాతకు నోటీసులు ఇస్తానని చెప్పాడు.

అంతే కాదు ఇకపై సినిమాలపై ఫోకస్ పెడతామని.. డ్రగ్స్ వాడకం సన్నివేశాలు ఉంటే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ అవ్వగానే మూవీ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కే ఎలర్ట్ అయ్యారు. సివి ఆనంద్ ప్రెస్మీట్ నిర్వహించిన కార్యాలయానికి వెళ్లి ఆయన్ని కలిశారు. సినిమాలో డ్రగ్స్ వాడుతున్న సన్నివేశాలు పెట్టడంపై వివరణ ఇచ్చారు. ఆనంద్‌ని కలిసిన అనంతరం సాయి రాజేష్ మీడియాతో మాట్లాడాడు.

బేబీ సినిమాలో డ్రగ్స్ స‌ని వేశాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులకు వివరంగా చెప్పామని.. కథలో భాగంగానే సన్నివేశాలు డ్రగ్స్ వాడకం పెట్టాల్సి వచ్చిందని కమిషనర్ కు వివరించామని చెప్పారు. సెన్‌సార్‌ పూర్తయిపోయిన సినిమాలో నుంచి ఇప్పుడు సన్నివేశాలను తీసేయమంటే కష్టమని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో మంచి చెప్పాను మంచి చెప్పాల్సి వస్తే మళ్ళీ ఇలాంటి సీన్లు తీస్తాను. డ్రగ్స్ వాడొద్దని చెప్తాను అని సాయి రాజేష్ మీడియాకు వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.