బాల‌య్య‌ను ఆ వ‌రుస‌తో పిలిచి బంధుత్వం క‌లిపేసిన శ్రీలీల‌…!

టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో ఇండ‌స్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌లీల తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా శ్రీ‌లీల గుర్తింపు తెచ్చుకుంది. అతి త‌క్కువ‌ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ‌లీల ప్రస్తుతం వరుస‌ సినిమాల్లో స్టార్ హీరోలతో న‌టించే అవ‌కాశాల‌ను అందుకుంది.

శ్రీ‌లీలా – బాలయ్యతో భగవంత్‌ కేసరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల.. కీరోల్‌లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీలా బాలకృష్ణ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది. బాలకృష్ణ సార్ బయట వేరు కెమెరా ముందుకొస్తే వేరు.. ఒకసారి పాత్రలోకి ఎంటర్ అయ్యారంటే ఇక ఆయన భగవంత్ కేస‌రి అంతే.. బాలకృష్ణ కాదు అంతగా పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి నటిస్తారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇందులో మా పాత్రల గురించి రివిల్ చేయడం నాకు ఇష్టం లేదు అంటూ వివ‌రించింది. అయితే ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన నాకు సొంత బాబాయ్‌లాగా అనిపించారు. ఆయన కూడా లొకేషన్‌లో నన్ను అలాగే చూసుకున్నారు.. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్య సార్‌తో సినిమా ఖచ్చితంగా చేస్తాను. చేయాలని ఆశగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం శ్రీ‌లీలా బాల‌య్య‌ని బాబాయి లా ఫీల్ అవ్వ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ ఫుల్ హ్య‌పీగా ఫీల్ అవుతున్నారు.