ఖుషి బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 53 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వ‌చ్చిందెంతో తెలిస్తే షాకే!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన `ఖుషి` మూవీ గ‌త వారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ద‌క్కింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఖుషి మంచి వ‌సూళ్ల‌ను రాబడుతోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే స‌గానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది.

ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.20.91 కోట్ల షేర్‌, రూ.34.50 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను అందుకున్న ఖుషి.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 32.53 కోట్ల షేర్‌, రూ. 60.45 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించింది. మ‌రో రూ. 20.97 కోట్ల రేంజ్ లో షేర్ వ‌సూళ్ల‌ను అందుకుంటే.. ఖుషి బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అవుతుంది. కాగా, ఏరియాల వారీగా ఖుషి సినిమా 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 11.20 కోట్లు
సీడెడ్: 2.03 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.46 కోట్లు
తూర్పు: 1.26 కోట్లు
పశ్చిమ: 1.00 కోట్లు
గుంటూరు: 1.26 కోట్లు
కృష్ణ: 1.08 కోట్లు
నెల్లూరు: 0.62 కోట్లు
—————————
ఏపీ+తెలంగాణ‌= 20.91 కోట్లు(34.50 కోట్లు~గ్రాస్‌)
—————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 2.45 కోట్లు
ఇతర భాషలు: 2.10 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 7.10 కోట్లు
—————————
టోటల్ వరల్డ్ వైడ్ = 32.53 కోట్లు(60.45కోట్లు~ గ్రాస్)
—————————