హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కవ్విస్తున్న శ్రియా శరణ్‌..

శ్రియా శరణ్ హిందీ, తమిళం, తెలుగు వంటి అనేక భాషల సినిమాల్లో నటించి అలరించింది. చాలా క్యూట్ గా ఉండే ఈ బ్యూటీ తన అందం అమాయకమైన నటనతో చాలామంది హృదయాలను దోచేసింది. పెళ్లయినా అందాలను ఎగ్జిబిషన్ గా పెట్టడంలో అసలు వెనకాడదు. ఇటీవల, ఈ అందాల తార కేరళలోని కోవలం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలలో, శ్రియ పింక్ బికినీ టాప్, బ్లూ డెనిమ్ షార్ట్ ధరించి కనిపించింది. సముద్రం, ఆకాశం వంటి బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ పోజులిచ్చి అభిమానుల గుండెల్లో దడ పుట్టించింది. ఆమె టోపీ, సన్ గ్లాసెస్ కూడా ధరించే మరింత అందంగా కనిపించింది. లైఫ్ ఈజ్ ఎ బీచ్, కోవలం యూ ఆర్ సో బ్యూటిఫుల్ అని ఆమె ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.

శ్రియ అభిమానులు, ఫాలోవర్లు ఆమె ఫోటోలు చూసి వావ్ యు లుక్ సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వయసు పైపడ్డా ఆమె అందం ఏమాత్రం కరగలేదని కామెంట్ చేశారు, ఆమె జీరో సైజ్ ఫిట్‌నెస్ గురించి ప్రశంసించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

ఇకపోతే శ్రియా సరన్ రష్యాకు చెందిన వ్యాపారవేత్త మరియు టెన్నిస్ క్రీడాకారుడు అయిన ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. 2018లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి వివాహం జరిగింది. శ్రియ తరచుగా తన భర్త చిత్రాలను, వారి ప్రయాణాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆమె దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడం వంటి వివిధ సామాజిక కారణాలు, స్వచ్ఛంద సంస్థలకు కూడా మద్దతు ఇస్తుంది.

రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ RRR, దృశ్యం 2 సినిమాల్లో కనిపించే అలరించింది. నరగాసూరన్ వంటి కొన్ని అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది.