సంయుక్త బర్తడే గిఫ్ట్.. డెవిల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!

నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. గత ఏడాది బింబిసారా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోక ఆ తర్వాత అమీగోష్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు తాజాగా డెవిల్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Samyuktha Menon as Nyshadha in 'Devil' poster - South Indian Actress

ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని సైతం చిత్ర బృందం విడుదల చేశారు ఈ లుక్ లో సంయుక్త దేవతల కనపడుతోంది.. ఎరుపు రంగు పట్టు చీర ఆకుపచ్చ జాకెట్ వేసుకొని కళ్ళకు కాటుక పెట్టుకుని చేతిలో పూల సజ్జ పట్టుకొని కుందనపు బొమ్మల కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలా చీర కట్టుకొని ఆమె గుడికి వెళుతున్నట్టుగా ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడం జరుగుతోంది. అభిమానులను కూడా ఆకట్టుకునే విధంగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

നൈഷാദയായി സംയുക്ത , നന്ദമുരി കല്യാൺ റാമിന്റെ സ്പൈ ത്രില്ലർ 'ഡെവിൾ'

సంయుక్త మీనన్ తెలుగులో వరుసగా పలు సినిమాలలో నటిస్తోంది. గతంలో విరూపాక్ష, బింబిసార ,సర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు డెవిల్ సినిమాలో నటిస్తూ ఉన్నది. సంయుక్త లుక్ పరంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పైన మరింత బజ్ ఏర్పడుతోంది.. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి హయాంలో వాళ్ళ యొక్క ఏజెంట్గా చేసిన వ్యక్తి కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నాయాదర్శకత్వం వహిస్తూ ఉన్నారు. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.