ఖుషి సినిమా ర‌ష్మిక చేసుంటే స‌మంత వేస్ట్ అయ్యేదా…!

తాజాగా సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ రోజే పాజిటివ్ టాక్ సంపాదించడంతో మొదటి రోజు కలెక్షన్స్ అదరగొట్టింది. ఫుల్ ఆక్యుపేషన్స్ తో అన్ని థియేటర్స్ నిండిపోయాయి. లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాల్లో రొమాన్స్, ఫన్ తో పాటు క్లైమాక్స్‌లో ఎమోషన్స్ బాగా పండించారట. క్లైమాక్స్ సీన్ కారణంగానే ఈ సినిమా హిట్ అయిందని టాక్.

ఈ సినిమాల్లో సమంత తన లవ్ మార్క్ నటనతో అదరగొట్టింది. కానీ విజయ్ దేవరకొండ తో పోటీ పడలేకపోయిందట‌. తన అనారోగ్య కారణంగానో.. మరి ఇంకేదైనా కారణంగానో సమంత ఈ సినిమాలో తన నటనను పూర్తిలెవెల్‌లో చూపించలేక పోయిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే విజయ్‌కి జోడిగా రష్మిక నటింస్తే ఈ సినిమా మరో రేంజ్ లో ఉండేదని ఫ‌క‌యాన్స్‌ భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రష్మిక కాంబినేషన్లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక‌ ఈ సినిమాల తర్వాత వీరిద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ ఉందంటూ.. ఏదో సీక్రెట్ రిలేషన్షిప్ జరుగుతుంది అంటూ.. న్యూస్ కూడా వైరల్ అవుతుంది. కానీ డైరెక్టర్ శివ నిర్వాణ ఫస్ట్ ఆప్షన్ సమంత కావడంతో విజయ కూడా ఏమీ మాట్లాడలేదట. ఒకవేళ ఈ సినిమాలో సమంత ప్లేస్ లో రష్మిక నటించి ఉంటే సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ సాధించేదని వీరిద్దరి పెయిర్‌కి ఉన్న క్రేజ్‌కి ఈ సినిమాకు మరింత హైప్ పెరిగేదంటూ.. ఖుషి సినిమా ర‌ష్మిక చేసుంటే అదిరిపోయేదంటు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.