2023 వన్డే ప్రపంచ కప్ కు టీమిండియా టీమ్‌ ఇదే.. వారికి మాత్రం నో ఛాన్స్…!

వన్డే ప్రపంచ కప్ 2023కు 15 మంది టీహ‌ సభ్యులతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక శనివారం అర్ధరాత్రి భారత చీఫ్ సెలెక్టర్ అజిత్‌ అగర్కార్‌ శ్రీలంకలో ఉన్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌తో కీలకమైన సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలోనే వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జట్టను ఎంపిక చేసినట్లు జాతీయ మీడియాలో పలు వార్తలు బయటకు వచ్చాయి.

ఈ టీమ్‌లో యంగ్ క్రికెటర్ తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ప్రసిద్ద్‌ కృష్ణకు చోటుదక్కపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌కు ప్రకటించిన 17 మంది సభ్యులలో ఈ ముగ్గురికి చోటుదక్కింది. అయితే ప్రధాన టోర్నీకి మాత్రం వీరికి సెలెటర్లు మొండి చేయిచూపినట్లు తెలుస్తోంది.. అదేవిధంగా యుజువేంద్ర చాహల్‌ వైపు కూడా సెలక్టర్లు మొగ్గుచూపులేదని పలు రిపోర్టులు చెబుతున్నాయి.

మరోవైపు స్టార్ క్రికెటర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ నిరూపించుకున్నట్లు ఎన్సీఏ వర్గాలు వెల్లడించాయి. దాంతో అంతడు కూడా ప్రపంచకప్ జ‌ట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. కాగా వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే జ‌ట్టులు తమ వివరాలను సెప్టెంబర్5 లోపు ఐసీసీఐకి అందించాలి కాబట్టి సెప్టెంబర్ నాలుగు 4న భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో ఆడనుంది.

ప్రపంచకప్‌కు భారత జట్టు:రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.