నాగార్జున అన్నపూర్ణ స్టూడియో విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే .. ముఖ్యంగా నాగార్జున అంటేనే మన్మధుడు అనే పేరు గుర్తుకువస్తుంది.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు..ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న నాగార్జున ఇప్పటికి కూడా మన్మధుడు లానే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. రీసెంట్ గా నాగార్జున 64వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు.

Annapurna Studios in Banjara Hills

1967లో సుడిగుండాలు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి బాలా నటుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 1986వ సంవత్సరంలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. కొన్ని వందల సినిమాలలో నటించి భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నాగార్జున ఆస్తి విలువ సుమారుగా రూ .1500 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాలలోనే కూడా నాగార్జున కొన్ని కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇళ్లతో పాటు పలు రకాల ఆస్తులను కూడా సంపాదించినట్టు తెలుస్తోంది.

నాగార్జునకు అన్నపూర్ణ స్టూడియో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇందులో పలు రకాల సినిమాలను షోలను సైతం తెరకెక్కిస్తే ఉంటారు. అయితే దీని విలువ సుమారుగా రూ 300 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం ఇక నాగార్జునకు జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన భవనంతో పాటు కొన్నిచోట్ల వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఇద్దరు కుమారులు కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు. నాగార్జున ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే నా సామిరంగ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.