త్వరలో శుభవార్త చెబుతానంటున్న చిరు చిన్న కూతురు.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలలో నటించకపోయినా సరే మెగాస్టార్ కూతురుగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఆయన చిన్న కూతురు శ్రీజ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రధానంగా ఈమే వైవాహిక జీవితం ద్వారానే ఎక్కువగా వార్త‌ల్లో హైలెట్ గా మారింది. మొదటి పెళ్లి చేసుకున్న సమయంలో మెగా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగిన ఈమె.. మొదటి పెళ్లి విషయంలో బాబాయి పవన్ కళ్యాణ్ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో అప్పట్లో బాగా వార్తల్లో నిలిచింది.

అయితే మొదటి బిడ్డ జన్మించిన తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న కూతురితో సహా చిరంజీవి తన ఇంటికి తీసుకువచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరిపించడం.. తర్వాత నవిష్క జన్మించడం అందరికీ తెలిసిందే. అయితే ఏమైందో కానీ ఇప్పుడు అతనితో కూడా ఈమె దూరంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీజ‌- కళ్యాణ్ దేవ్‌ దూరంగానే ఉంటున్నారు.. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు. కూతురు నవిష్క ను మాత్రం వారానికి ఒక రోజు తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు పంపిస్తుంది శ్రీజ.

ప్రస్తుతం ఈ మెగా డాటర్ వెకేషన్ లో ఉంటూ ఎంతో ఎంజాయ్ చేస్తుంది.. తన స్నేహితులతో కలిసి పార్టీలు కూడా చేసుకుంటుంది. ఇదే సమయంలో ఆ వెకేషన్ లో ఉంటూ సంథింగ్ ఇస్ కమింగ్ అంటూ శ్రీజ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరిలో అనుమానాలు పుట్టిస్తుంది. అంటే కొత్తగా ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతోందని మాత్రం మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆ పోస్ట్‌ కింద స్వాతి నిమ్మగడ్డ అనే పేరును కూడా ఈమె ట్యాగ్ చేసింది.

దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ త్వరలో ఏదైనా మొదలు పెట్టబోతున్నారా? లేక ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తారా.. ఇంకా ఏదైనా కొత్త విషయాన్ని చెప్పబోతున్నారా? అన్నది ఇప్పుడు అందరిలో పలు ప్రశ్నలను కలిగిస్తోంది. మొత్తానికి అయితే శ్రీజ చేసిన ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. మరి శ్రీజ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలి అంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.